పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని, 41 రోజుల దీక్ష విరమణ సందర్భంగా కళా నగర్ హనుమాన్ మందిరంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి.
జంగల్ హనుమాన్ నుండి మాల ధరించి దీక్ష చేపట్టిన ఆంజనేయ స్వాములు, తమ దీక్ష చివరి రోజున కళా నగర్ హనుమాన్ మందిరంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
మధ్యాహ్నం జరిగిన అన్నదాన కార్యక్రమంలో స్వాములతో పాటు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ అన్న ప్రసాదాలు అందించారు.
దీక్ష పూర్తి చేసుకున్న స్వాములను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. అనంతరం, స్వాములు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లారు.
హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.











