నిర్మల్, 2024-07-29
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా యువ మోర్చా (బీజేపీ వైఎం) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో 'ఫీజుల బకాయి – బీజేపీ లడాయి' పేరుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
బి జె వై ఎం ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఫీజుల బకాయి – బీజేపీ లడాయి కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బి జె వై ఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని హెచ్చరించారు.
ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయని పక్షంలో 'ఫీజుల బకాయి – బీజేపీ లడాయి' ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు సాదం అరవింద్, జంగం వీరేష్, జమాల్, జుట్టు దినేష్, ఇర్ల విజయ్, శ్రీకాంత్ రెడ్డి, కందుల హరీష్, భరత్, కౌన్సిలర్లు రాజు, నరేష్, శశాంక్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.












