భైంసా, 1 August
భైంసా పట్టణంలోని గురు కృప వొకేషనల్ కళాశాలలో GVK EMRI 108 సర్వీసెస్ ఆధ్వర్యంలో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది, ముదోల్ నియోజకవర్గంలోని ఆర్ఎంపి, పిఎంపీలకు గుండెపోటుపై అవగాహన కల్పించారు.
GVK EMRI 108 సర్వీసెస్ ఆధ్వర్యంలో గుండెపోటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. భైంసా పట్టణంలోని గురు కృప వొకేషనల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది EMT లక్ష్మణ్ పూజారి, ముదోల్ నియోజకవర్గంలోని ఆర్ఎంపి, పిఎంపీలకు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) పై అవగాహన కల్పించారు.
నేటి జీవనశైలిలో కలుషితమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు క్షీణించడం వల్ల ఎప్పుడు గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని, కాబట్టి ప్రతి ఒక్కరూ సీపీఆర్ తప్పనిసరిగా నేర్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ సీపీఆర్ పై 108 అంబులెన్స్ సిబ్బంది ఉచితంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గురు కృప వొకేషనల్ కళాశాల డైరెక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్, ప్రిన్సిపల్ సాయినాథ్, 108 సిబ్బంది EMT లక్ష్మణ్ పూజారి, పైలట్ ఖాజమోయినోద్దిన్, నియోజకవర్గంలోని ఆర్ఎంపి, పిఎంపీలు పాల్గొన్నారు.












