భైంసా, జులై 10
భైంసా మండలానికి చెందిన 23 మంది నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ శుక్రవారం అందజేశారు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.
భైంసా మండలం లోని ఆయా గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇందిరమ్మ పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు. దశల వారీగా అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
గత పదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్లే పేదలకు ఇళ్ల నిర్మాణానికి నిధులు రాలేదని ఆయన విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నిరజ్ కుమార్, సర్పంచులు సిరం సుష్మరెడ్డి, సిరం రాజమణి శ్రీనివాస్, అప్పాల రాకేష్, అశోక్, సుధాకర్, గంగాప్రసాద్, బాలాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.












