బెల్తారోడాలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
తానూర్ ఆగస్టు 24 మనోరంజని తెలుగు టైమ్స్ : మండలంలోని బెల్తారోడా గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా దమ్మన్ దమ్మయ్య, ఉపాధ్యక్షులుగా ధర్మపురి మాధయ్య, కోశాధికారిగా పి. శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అలాగే కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. మున్నూరు కాపు సంఘం ఐక్యతకు కృషి చేస్తామని, సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. యువత, మహిళలు, విద్యార్థుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.నూతన కార్యవర్గ సభ్యులను సంఘ పెద్దలు, సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ మున్నూరు కాపు సంఘం సభ్యులు, యువత, పెద్దలు పాల్గొన్నారు.












