ఉమ్రి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 23
తానూరు మండలంలోని ఉమ్రి గ్రామంలో సాహిత్య సామ్రాట్ అన్న బాహు సాటే గారి 106వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, అన్న బాహు సాటే గారి సేవలను కొనియాడారు.
తానూరు మండలంలోని ఉమ్రి గ్రామంలో సాహిత్య సామ్రాట్ అన్న బాహు సాటే గారి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఘనంగా వేడుకలు
అన్న బాహు సాటే గారి స్మృతిలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలకు పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన సాహితీ సేవలను, సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సాగర్ బాయ్ రాజన్న, మాజీ ఆత్మ చైర్మన్ పోత రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఉత్తం భలేరావు, గైక్వాడ్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, సినిమా డైరెక్టర్ కొత్తూరు శంకర్, వికాస్ పాటిల్, సాయిచంద్, పూజారి లక్ష్మణ్, గోణేకర్ శంకర్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












