Delhi, గురువారం
జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. స్వల్ప చర్చ అనంతరం లోక్సభ ఈ చట్టాన్ని ఆమోదించింది. దేశ గౌరవానికి అవమానాలను నిరోధించే (సవరణ) బిల్లు, 2026ను ఒక రోజు ముందు బుధవారం రాజ్యసభ ఆమోదించింది.

ఇప్పుడు దిగువ సభలో కూడా ఆమోదం పొందడంతో ఈ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనున్నది. ఈ బిల్లు ప్రకారం, వందేమాతర గేయం ఆలపిస్తున్నప్పుడు ఆటంకాలు సృష్టించినా, అడ్డుకున్నా మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. నీట్ లీక్పై విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ, ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.