ఖానాపూర్, జూలై 26
కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే 'విజయ దివస్'ను ఖానాపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది నరేంద్రనాథ్ మాట్లాడుతూ, శత్రు దేశాన్ని గడగడలాడించిన ఈ యుద్ధం, భారత ఆర్మీ వీరోచిత పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. పాకిస్తాన్ దురాక్రమణను తిప్పికొట్టి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జవాన్లకు నివాళులర్పించారు.
కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే 'విజయ దివస్'ను ఖానాపూర్ లో ఘనంగా నిర్వహించారు. శత్రు దేశాన్ని గడగడలాడించిన ఈ యుద్ధం, కదన రంగంలో ఇండియన్ ఆర్మీ వీరోచిత పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘటన అని న్యాయవాది నరేంద్రనాథ్ అన్నారు. కార్గిల్ లోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు పాకిస్తాన్ చేసిన కుట్రలను మన జవాన్లు తిప్పికొట్టారని ఆయన తెలిపారు. జులై 26, 1999 ప్రతీ ఒక్క భారతీయుడు మరిచిపోలేని రోజుగా అభివర్ణించారు. యావత్ దేశం మొత్తం 'జయహో భారత్' అంటూ నినదించిన రోజు, ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. దాయాది దేశం పాకిస్తాన్ దురాక్రమణను తిప్పికొట్టి, మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు మన జవాన్లు.
మన భారత సైన్యం దేశానికి అందించిన సేవలకు శిరసు వంచి వారికి నమస్కరిస్తూ, ఆశ్రు నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. న్యాయవాది నరేంద్రనాథ్, మరికొందరు యువకులు ఘనంగా నివాళులు అర్పించారు.












