హైదరాబాద్, జులై 26
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర సైనికులకు యావత్ దేశం ఘన నివాళులు అర్పిస్తోంది. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకున్నారు.

1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం ప్రదర్శించిన అసాధారణ ధైర్యం, త్యాగం, అంకిత భావానికి గుర్తుగా ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ను నిర్వహిస్తున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వత ప్రాంతాల్లో శత్రు బలగాలను ఎదుర్కొని భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజు జరుపుకుంటారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా వీర సైనికులకు నివాళులర్పించారు. దేశ సరిహద్దులను కాపాడేందుకు సైనికులు చూపిన అపారమైన ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
దేశ భద్రత కోసం సైనికులు ప్రదర్శించిన అంకితభావం, దేశంపై వారి అచంచలమైన ప్రేమను ప్రతి భారతీయుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని ప్రధాని తెలిపారు.