చిక్కుకున్న కార్మికులపై సన్నగిల్లుతున్న ఆశలు

శ్రీశైలం టన్నెల్ సహాయక చర్యలు
  • శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌లో ప్రమాదం
  • 48 గంటలుగా కొనసాగుతున్న సహాయ చర్యలు
  • గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ ఇంకా తెలియరాదు
  • టన్నెల్‌లో నీటి ఉధృతి, బురద సహాయక చర్యలకు అడ్డంకి
  • రక్షణ చర్యల్లో ఆర్మీ, నేవీ, NDRF, SDRF బృందాలు

 

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల కోసం సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 48 గంటలు గడిచినా వారి ఆచూకీ తెలియలేదు. భారీగా నీటి లీకేజీ, బురద పేరుకుపోవడం రక్షణ చర్యలకు తీవ్రంగా ఆటంకంగా మారింది. రైల్వే, ఆర్మీ, నేవీ, NDRF, SDRF బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా, ఇప్పటికీ వారు గల్లంతైన ప్రాంతానికి చేరుకోలేకపోయారు.

 

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. 48 గంటలుగా సహాయ చర్యలు కొనసాగుతున్నా, టన్నెల్‌లో భారీగా నీరు, బురద పేరుకుపోవడంతో సహాయక బృందాలకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెస్క్యూ బృందాలు శిథిలాల కింద కార్మికుల కోసం గాలిస్తున్నాయి.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో వందల మీటర్ల మేర బురద, బండరాళ్లు పేరుకుపోవడంతో, సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, నిమిషానికి 5,000 లీటర్ల నీరు టన్నెల్‌లోకి వస్తుండటంతో సమస్య మరింత తీవ్రతరమైంది.

సహాయక చర్యలను వేగవంతం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపింది. సీనియర్ ఇంజినీర్లు, వెల్డర్లు, టెక్నీషియన్లు శిథిలాల తొలగింపు, లోపల చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు శ్రమిస్తున్నారు. మెటల్ కటింగ్, తవ్వక యంత్రాలను ఉపయోగిస్తూ రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి.

ఆర్మీ, నేవీ, NDRF, SDRF, సింగరేణి, BRO, NGRI, GSI, L&T సహా అనేక బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నా, విపరీతమైన నీటి ప్రవాహం, బురద కార్మికులను చేరుకునే మార్గాన్ని నిర్బంధిస్తోంది. ప్రభుత్వం కార్మికులను సురక్షితంగా బయటకు తీయడానికి అన్ని రకాల చర్యలు చేపడుతుందని అధికారుల వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment