ములుగు కలెక్టర్ దివాకర్‌ టి ఎస్‌ వినూత్న విధానం: అడవిలో కంటైనర్‌ పాఠశాల

Alt Name: ములుగు జిల్లా గోత్తికోయ గూడేల్లలో కంటైనర్ పాఠశాల
  • ములుగు కలెక్టర్‌ దివాకర్‌ టి ఎస్‌ ఆధ్వర్యంలో అడవిలో కంటైనర్‌ పాఠశాల
  • గోత్తికోయ గూడేల్లలో అక్షరాల వెలుగులు చిమ్మించిన కలెక్టర్‌
  • అటవీ శాఖ అనుమతుల అడ్డంకిని అధిగమించి పాఠశాల నిర్మాణం
  • గ్రామస్తుల ప్రశంసలు పొందిన కలెక్టర్‌ దివాకర్‌ టి ఎస్‌

 Alt Name: ములుగు జిల్లా గోత్తికోయ గూడేల్లలో కంటైనర్ పాఠశాల

నాగబెల్లిజితేందర్ సామ్రాట్_

సినియర్ జర్నలిస్ట్

 

: ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టి ఎస్‌ గోత్తికోయ గూడేల్లలో కంటైనర్‌ పాఠశాలను నిర్మించి ఆదివాసీ పిల్లలకు అక్షరాల వెలుగులు తెచ్చారు. అటవీ శాఖ అనుమతుల సమస్య ఉన్నప్పటికీ, కలెక్టర్‌ వినూత్నంగా కంటైనర్‌ పాఠశాల నిర్మించడంతో గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు. 2017 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన దివాకర్‌ టి ఎస్‌ సమర్థవంతమైన అధికారిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

Alt Name: ములుగు జిల్లా గోత్తికోయ గూడేల్లలో కంటైనర్ పాఠశాల

 ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టి ఎస్‌ తన వినూత్న ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఇటీవల ఆయన, ఎటూర్‌ నాగారం ఏజెన్సీ గోత్తికోయ గూడేల్లలో అక్షరాలకు నోచుకోని ఆదివాసీ పిల్లలకు విద్య అందించాలనే సంకల్పంతో అడవిలో కంటైనర్‌ పాఠశాల నిర్మాణం చేపట్టారు.

అడవిలో నివసించే గోత్తికోయ గూడేల్లలో పసిపిల్లలు వేటకు వెళ్తూ విద్యకు దూరంగా ఉంటారని కలెక్టర్‌ గుర్తించి, అక్కడ విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో, ఆయన కంటైనర్‌ ద్వారా పాఠశాల నిర్మాణం చేయాలని భావించారు. ఈ కంటైనర్‌ పాఠశాల కోసం 13 లక్షల నిధులు మంజూరు చేయగా, 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో పాఠశాల పూర్తయింది.

ఈ పాఠశాలలో 12 డ్యూయల్‌ డెస్క్‌లు, ఉపాధ్యాయులకు మూడు కుర్చీలు ఏర్పాటు చేయబడ్డాయి. గ్రామస్తులు, అధికారుల ప్రశంసలను పొందిన దివాకర్‌ టి ఎస్‌ త్వరలోనే ఈ పాఠశాల ప్రారంభోత్సవాన్ని మంత్రి సీతక్కతో నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు.

2017 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన దివాకర్‌ టి ఎస్‌, తన పదవీకాలంలో ప్రజలకు సత్వర న్యాయం అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. భూపాలపల్లి జాయింట్‌ కలెక్టర్‌గా సేవలందించిన దివాకర్‌ ప్రస్తుతం ములుగు జిల్లా కలెక్టర్‌గా పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల అభినందనలు పొందుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment