భీమారంలో గంజాయి పట్టివేత, నిందితులను రిమాండ్ కు తరలింపు.

భీమారంలో గంజాయి పట్టివేత, నిందితులను రిమాండ్ కు తరలింపు.

భీమారంలో గంజాయి పట్టివేత, నిందితులను రిమాండ్ కు తరలింపు.

మనోరంజని తెలుగు టైమ్స్ , మంచిర్యాల జిల్లా, భీమారం మండలం

భీమారం మండల కేంద్రంలో గంజాయి సేవిస్తున్న నిందితులను పట్టుకొని వారిని రిమాండ్ కు తరలించామని ఎస్సై కె. శ్వేత తెలిపారు. వివరాల ప్రకారం శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ ఆదేశాల మేరకు మంగళవారం నమ్మదగిన సమాచారం మేరకు ఐదుగురు వ్యక్తులు నిషేధిత గంజాయి కలిగి వుండి మరియు దానిని తాగుతూ వారు భీమారం గ్రామం లోని గోపతి రాజా బిల్డింగ్ వద్ద ఉన్నారని తెలుసుకొని వెళ్ళగా వారు పోలీస్ వారిని చూసి పారిపోతుండగా అట్టి నేరస్తులను భీమారం పోలీస్ సిబ్బంది సహాయంతో వారిని పట్టుకున్నారు. అందులో భీమారం గ్రామం, తాళ్ల గూడెం చెందిన దుర్గం సంజయ్, సుంకరపల్లి కి చెందిన సెగ్గం విజయకుమార్, పొలవేని రాజేందర్, రామడుగు గ్రామానికి చెందిన కుక్కల అరవిందు, అనేమోల శేఖర్ వున్నారు. వారి వద్ద నుండి 350 గ్రాముల ఎండు గంజాయి, బాలేనో కారు, స్ప్లెండర్ బైక్ ను స్వాధీన పరుచుకున్నామని తెలిపారు. పైన తెలిపిన ఐదుగురు వ్యక్తులకి గత సంవత్సరం నుండి గంజాయి తాగుటకు అలవాటు పడగా, ఇందారం నకు చెందిన అంజి, శ్రీరాంపూర్ కి చెందిన లింటు గంజాయి తీసుకువచ్చి అమ్ముతారని, అందులో నుండి కొంత వారు ఐదుగురు తాగడానికి ఉపయోగించి మిగిలియిన దాన్ని ‘ఎవరికైనా అమ్మి వచ్చిన డబ్బును తమ జల్సా లకు వాడుకుంటారని తెలిపారు. లింటు, అంజి ద్వారా నిందితులు గంజాయిని తీసుకొని కొంత వినియోగించగా నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. లింటు,అంజి పరారీలో ఉన్నారని శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment