బాలానగర్‌లో దారుణం — ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

బాలానగర్‌లో దారుణం — ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

బాలానగర్‌లో దారుణం — ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

 

  • హైదరాబాద్ బాలానగర్‌లో విషాద ఘటన

  • కవలపిల్లలైన కార్తికేయ, లాస్యతను హతమార్చిన తల్లి

  • బిల్డింగ్ పై నుంచి దూకి సాయి లక్ష్మి ఆత్మహత్య

  • కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణ



హైదరాబాద్ బాలానగర్‌లో మంగళవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో ఇద్దరు కవలపిల్లలను హతమార్చిన తల్లి సాయి లక్ష్మి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులు కార్తికేయ, లాస్యతగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో విసిగిపోయిన సాయి లక్ష్మి (తల్లి) ఇద్దరు కవలపిల్లలైన కార్తికేయ, లాస్యతలను హతమార్చి అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ విభేదాలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment