మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్

మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్

మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్

హైదరాబాద్, ఫిబ్రవరి 03: మెజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్, మంచు మోహన్ బాబు పరస్పరం దూషణలకు దిగారు. మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని జిల్లా కలెక్టర్ విచారణకు పిలిచారు. ఆ క్రమంలో సోమవారం అంటే.. ఫిబ్రవరి 03వ తేదీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు వీరిద్దరు హాజరయ్యారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ వారిద్దరిని రెండు గంటల పాటు విచారించారు. అయితే వచ్చే వారం మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని వారిద్దరిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

మరోవైపు తల్లిదండ్రులు, వృద్ధులు సంరక్షణ చట్టం కింద తనకు భద్రత కల్పించాలంటూ జిల్లా కలెక్టర్‌ను కోరారు. అలాగే తన ఆస్తులను సైతం కాపాలని విజ్జప్తి చేశారు. ఈ ఆస్తి అంతా తాను కష్ట పడి సంపాదించిందని జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు వివరించారు. అలాంటి ఈ ఆస్తిలో ఎవరి హక్కు లేదని ఆయన పేర్కొ్న్నట్లు తెలుస్తోంది. అయితే తనకు సంబంధించిన ఆస్తిలో మంచు మనోజ్ ఉన్నారని.. అతడిని అందులోనుంచి ఖాళీ చేయించాలని కోరారు..

Join WhatsApp

Join Now

Leave a Comment