నాగర్ కర్నూల్ జిల్లాలో మైనింగ్ మంటలు
మనోరంజని ప్రతినిధి
నాగర్ కర్నూలు జిల్లా: జనవరి 21
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలా రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనింగ్ తవ్వ కాలు నిలిపేయా లంటూ ఈరోజు ఉదయం గ్రామ స్తులు ఆందోళన చేపట్టారు.
గ్రామంలో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. రాత్రికి రాత్రే పలువురు గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు గ్రామంలోకి రాకుండా ముళ్ల కంచెలు వేశారు గ్రామస్తులు.
అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయా లని డిమాండ్ చేశారు. వీరికి పౌర హక్కుల సంఘం నేతలు మద్దతు ప్రకటిం చారు.గత కొంతకాలంగా మైనింగ్ తవ్వకాలకు సంబంధించి వివాదం కొనసాగుతోంది.
మైనింగ్ తవ్వకాలను పూర్తిగా నిలిపివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీకి పిలుపునిచ్చారు గ్రామస్తులు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాత్రికి రాత్రి కొంతమంది గ్రామస్తు లను అరెస్టు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపు లాట జరిగింది. అన్ని పార్టీ నాయకులు, పౌర హక్కుల సంఘాల నేతలు గ్రామస్తు లకు మద్దతు తెలిపారు. మైలారం గుట్టలో తవ్వకా లు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుండగా.. ఎప్పటికప్పుడు గ్రామస్తులు అడ్డుకుంటున్నారు.
ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి మైనింగ్ కు వ్యతిరేకంగా జరుగుతు న్న ఆందోళనలో పాల్గొన్నారు