: మావోయిస్టు అగ్రనేత సుజాత అరెస్టు

Maoist Leader Sujata Arrested
  • మావోయిస్టు కీలక నేత సుజాతను అరెస్టు.
  • ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.
  • మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు విచారిస్తున్నారు.

హైదరాబాద్: అక్టోబర్ 17

, మావోయిస్టు కీలక నేత సుజాతను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. చికిత్స కోసం కొత్తగూడెకు వెళ్తున్న ఆమెను సుక్మాలో పట్టుకున్నారు. సుజాతపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రూ. కోటికి పైగా రివార్డ్ ఉంది.

హైదరాబాద్: అక్టోబర్ 17,

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు అరెస్టు చేశారు. చికిత్స కోసం కొత్తగూడెకు వెళ్ళుతున్న సమయంలో తెలంగాణ పోలీసులు ఈరోజు ఉదయం ఆమెను పట్టుకున్నారు.

సుక్మాలో ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం అందింది. మావోయిస్టుల ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన సుజాతపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రూ. కోటికి పైగా రివార్డ్ ఉంది.

ప్రస్తుతం ఆమె బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. ఆమె మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నందున, సుక్మా ప్రాంతంలో అనేక సంఘటనల్లో ఆమె పాత్ర ఉంది. మహబూబ్ నగర్‌కు చెందిన కల్పన అలియాస్ సుజాతను పోలీసులు విచారిస్తున్నారు.

మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో ఆమె పనిచేశారు.

ఇక, ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు, రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం ఉంది. మృతులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, పీఎల్‌జీఏ, 6వ కంపెనీ, తూర్పు బస్తర్ డివిజన్‌కు చెందిన వారిగా గుర్తించబడినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment