ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ – అక్టోబర్ 08
సారంగపూర్:
స్వర్ణ వాగులో విద్యుత్ తీగలసాయంతో చేపలు పట్టే సమయం లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బజార్ హత్తునూర్ మండలం మడేపల్లి గ్రామానికి చెందిన సంతోష్(26) అను నతను .మండలంలోని స్వర్ణ గ్రామంలోని బొడకుంటి రాజేశ్వర్ వద్ద కొంతకాలంగా పాలెరుగా పనిచేస్తున్నాడు. సోమవారం వ్యవసాయ పనులకని వెళ్ళి స్వర్ణ వాగు సమీప వ్యవసాయ పంట చేనులో గల పంపు సెట్ నుండి అక్రమంగా కరెంట్ కనెక్షన్ తీసుకొని చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగల కు అంటుకొని మృతి చెందారు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో మంగళవారం సంతోష్ కోసం కుటుంబీకులు వెతుకుతుండగా వాగు సమీపంలో కరెంట్ తీగలకు అంటుకొని మృత దేహం కనిపించింది మృతుని తండ్రి అర్జున్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకొని సంఘటన తలనికి వెళ్ళి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు