ప్రమాదవశాత్తు స్వర్ణ వాగులో పడి వ్యక్తి మృతి
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి – అక్టోబర్ 18, 2025
సారంగాపూర్ మండలం ప్యారామూర్ గ్రామానికి చెందిన పగుడపు భోజన్న (59) అనే వ్యక్తి స్వర్ణ వాగులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన విషాద ఘటన శనివారం చోటుచేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా భోజన్న మతిస్థిమితం సరిగా లేక గ్రామంలో తిరుగుతూ ఉండేవాడు. ఇటీవల అతని అక్క అతన్ని బోరెగం గ్రామానికి తీసుకెళ్లి సంరక్షణలో ఉంచింది. అయితే నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం శనివారం ఉదయం స్వర్ణ వాగులో మృతదేహం కనిపించింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, పిల్లలు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు.