M4News (ప్రతినిధి)
ముధోల్: అక్టోబర్ 11
68వ దమ్మ చక్ర పరివర్తన దినోత్సవం పురస్కరించుకొని, 14వ తేదీ సోమవారం నిర్వహించే ధమ్మ దీక్షను విజయవంతం చేయాలని బిఎస్ ఐ ప్రధాన కార్యదర్శి గాయక్వాడ్ భుజంగరావు మరియు మహిళా మండలి అధ్యక్షులు లోకండే మీనా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని భారతీయ బౌద్ధ మహాసభ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు, ఇందులో ధమ్మ గురువులచే ధమ్మ దీక్ష సర్టిఫికెట్లను అందజేయబడుతుందని వారు వివరించారు. అభ్యర్థులకు పెద్ద ఎత్తున హాజరై, అనుయాయుల సర్టిఫికెట్లను పొందాలని సూచించారు.