దళిత కార్డు వాడుకుంటూ వ్యవహరించడం బాధాకరం: మాదాసు భాను ప్రసాద్

దళిత కార్డు

M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22

 

  • చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానులు
  • బోరుగడ్డ అనిల్ దుర్భాషలపై తీవ్ర విమర్శ
  • కులం కార్డు వాడుకోవడం క్షమారహితం

దళిత కార్డు వాడుకుంటూ చట్టాన్ని అతిక్రమించడం ఎవరికి సరిపడదని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ అన్నారు. బోరుగడ్డ అనిల్ గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులను, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి వాడిన దుర్వినియోగ పదజాలం సమర్థనీయం కాదని, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని ఆయన తెలిపారు.

లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు మాదాసు భాను ప్రసాద్, బోరుగడ్డ అనిల్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. దళితులలో పుట్టినంత మాత్రాన చట్టాలకు ఎవరూ అతీతులు కాదని, చట్టం ముందు ఎంతటి వారైనా సమానులే అని స్పష్టం చేశారు. బోరుగడ్డ అనిల్ గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులను, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలం ఏ రకంగానూ సమర్ధనీయం కాదన్నారు.

పోలీస్ అధికారులు, ప్రభుత్వం ఆయనను నియంత్రించలేకపోవడం, వ్యవస్థలో ఉన్న లోపాలను తెలుపుతోందని భాను ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను బెదిరించడం, మీడియా, సోషల్ మీడియాలో పరిమితి దాటి వ్యవహరించడం అధికారంలో ఉన్నవారు నిర్లక్ష్యాన్ని చూపుతున్నారన్న సంకేతమని అన్నారు.

అనిల్ అరెస్ట్ అనంతరం ఆయన భార్య కులం కార్డు వాడుకోవాలని చూడటం బాధాకరమని, చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్న సత్యాన్ని గుర్తు చేయాలని మాదాసు భాను ప్రసాద్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment