జగిత్యాలలో ఇన్స్టాగ్రామ్ ఫొటోపై ప్రేమ వివాదం: యువకుడి హత్య, ముగ్గురిపై కేసు
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ప్రేమ సంబంధ వివాదం రాత్రి ఘోర ఘటనకు దారి తీసింది. ఒక యువతిని ప్రేమించిన సతీష్ (25) అనే యువకుడు, ఆ అమ్మాయిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో కారణంగా కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురయ్యాడు.
యువతి కుటుంబసభ్యులు సతీష్‌ను హెచ్చరించినప్పటికీ, అతను మళ్లీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు, ఎవరు పెళ్లి చేసుకోవద్దని సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేయగా, శనివారం రాత్రి వారు కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాల కారణంగా సతీష్ అక్కడికక్కడే మృతిచెందాడు.
కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.