తొక్కిసలాట ఘటన.. కొడుకుకి చివరి ముద్దు
తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందగా.. ఎన్నో కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తన కొడుకుకి ఓ తల్లి చివరిసారిగా ముద్దు పెడుతున్న ఫోటో కంటతడి పెట్టిస్తోంది. కళ్ల ముందు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించింది