కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సస్పెండ్

కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సస్పెండ్

కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సస్పెండ్

మనోరంజని ప్రతినిధి | 2025 సెప్టెంబర్ 21 | కొమరం భీం ఆసిఫాబాద్

జిల్లాలో ఎరువుల పంపిణీ వ్యవహారంలో నిర్లక్ష్యం కారణంగా చర్యలు చోటుచేసుకున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి ఆర్. శ్రీనివాసరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు అధికారిక సమాచారం.

కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారని, యూరియా పంపిణీ పర్యవేక్షణలో లోపాలు, అవసరమైన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం, అధికారుల సూచనలను ధిక్కరించడం వంటి అంశాలు ఆయనపై ఆరోపణలుగా నమోదయ్యాయి.

జిల్లాలో రైతులకు సమయానికి ఎరువులు అందేలా పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, తగిన చర్యలు చేపట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఉన్నతాధికారులు ఇప్పటికే ఈ విషయంపై ప్రాథమిక నివేదిక అందుకున్నారని, వ్యవసాయ శాఖలో భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment