- ఉస్మానియా యూనివర్సిటీ లో 123వ కొమరం భీమ్ జయంతి జరుపుకున్నారు.
- ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు.
- కొమరం భీమ్ పోరాటం యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగం.
- ఆదివాసుల అభివృద్ధి కోసం ప్రభుత్వ చింతన.
ఉస్మానియా యూనివర్సిటీ లో 123వ కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ ములుగరం, రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే వేడమ్మ బొజ్జు పటేల్ తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్ ములుగరం ఆదివాసి జెండాను ఎగరవేసి, కొమరం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఉస్మానియా యూనివర్సిటీ:
ఉస్మానియా యూనివర్సిటీ అధికారికంగా 123వ కొమరం భీమ్ జయంతి వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ ములుగరం, రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ్మ బొజ్జు పటేల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కుమార్ ములుగరం మాట్లాడుతూ, కొమరం భీమ్ పోరాటం ఆదర్శప్రాయమని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగింపుగా రాబోయే కొమరం భీమ్ జయంతి నాటికి ఓయూలోని ఎస్సీ, ఎస్టీ సెల్ భవనం వద్ద కొమరం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం, ఎమ్మెల్యే వేడమ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, “కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితోనే నేను ఈరోజు ఎమ్మెల్యేగా నిలబెట్టుకొని మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిందని” అన్నారు. ఆదివాసి సమాజానికి అనేక హక్కులు, చట్టాలు అమలు జరుగుతున్నందున, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఆదివాసీ హక్కులు కాలరాయపడుతున్నాయని ఆయన వివరించారు.
ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, ఆదివాసీ విద్యార్థులు ఉన్నత విద్య, మరియు సమాజ పట్ల లోతైన అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, ఆదివాసీ ప్రొఫెసర్లు మరియు పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.