బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఖబర్దార్ ఎస్సై… మేము తలుచుకుంటే ఒక్క నిమిషం కూడా ఉండవు…
బోధన్ ఎస్సై మచ్చేందర్ పై కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక
మనోరంజని ప్రతినిధి
బోధన్ ఫిబ్రవరి 07
తన ఇసుకట్టిప్పర్లను అడ్డుకుంటూ తనకు సినిమా చూపెడతానని హెచ్చరిస్తూ బారసా నాయకుల ఇసుక టిప్పర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తమని బదిలాం చేస్తావా,? అంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ ఎస్సై మచ్చందర్ ను కాంగ్రెస్ నాయకులు బీహార్ తీవ్రంగా హెచ్చరించారు. తన గురించి తమ నాయకుడు ముందు నా సంగతి చూస్తానంటూ హెచ్చరిస్తావా? సమాజంలో తాగనివాడు ఎవడు ఉన్నారు
చెప్పు ఎస్సై గారు. తనని తాగుబోతుగా సృష్టించి తనపై దాడికి పాల్పడుతూ, భారత రాష్ట్ర సమితి పార్టీ ఇసుక మాఫియా కు అండగా ఉండలేదని గుండె మీద చేతి పెట్టుకొని ఒక్కసారి చెప్పు అంటూ ఎస్సై పై కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించారు.
బారసా ప్రభుత్వంలో తమ ఆస్తులు అమ్ముకుని కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పని చేశాం, తమ ప్రభుత్వం వచ్చిందని ఇప్పుడు ఇసుక తీసుకువెళ్తే తమ బండ్లను అడ్డుకుంటావా? అంటూ ఎస్ఐని ప్రశ్నించారు. తాము తలుచుకుంటే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేవు అంటూ ఎస్ఐ మచ్చేందర్ కు ఘాటు హెచ్చరికలు చేశారు బోధన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీహార్. ఇసుక మాఫియా ఏ స్థాయికి వెళ్ళిందో ఇది చూస్తే తేట తెల్లబోతుంది.