మణిపూర్ మహిళల హత్యకేసు.. కీలక కుట్రదారు అరెస్టు
మణిపూర్ మహిళల హత్యకేసు.. కీలక కుట్రదారు అరెస్టు
మణిపూర్లో గతేడాది నవంబరులో మైతేయ్ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను నిందితులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ ఘటనలో కీలక కుట్రదారును అరెస్టు చేసినట్లు తాజాగా వెల్లడించింది. “స్థానిక పోలీసులతో కలిసి అస్సాంలోని కఛర్ జిల్లాకు చెందిన తంగ్లియెన్లాల్ హమర్ అలియాస్ బోయా అనే నిందితుడిని అరెస్టు చేశాం.” అని ఎన్ఐఏ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది