ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం — సుప్రీంకోర్టు ఆదేశాలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆదేశం
-
క్లౌడ్, యాపిల్ క్లౌడ్ వివరాలు సమర్పించాల్సిందే
-
సమాచారం చెరిపేందుకు యత్నిస్తే కఠిన చర్యలు హెచ్చరిక
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ అధికారులకు కావాల్సిన క్లౌడ్, యాపిల్ క్లౌడ్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించింది. సమాచారం చెరిపే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు సిట్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది. క్లౌడ్, యాపిల్ క్లౌడ్ లాగిన్ వివరాలు — యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సహా సమర్పించాల్సిందేనని తెలిపింది. సాంకేతిక ఆధారాలు చెరిపేందుకు లేదా మార్చేందుకు ప్రయత్నించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సిట్ అధికారులు ఈ ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం చేయనున్నారు.