అమ్మతనానికే మచ్చతెచ్చిన కన్నతల్లి

అమ్మతనానికే మచ్చతెచ్చిన కన్నతల్లి

అమ్మతనానికే మచ్చతెచ్చిన కన్నతల్లి

///పల్నాడు జిల్లా //

//సత్తెనపల్లి, టౌన్//

:వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నపేగు పట్ల ఓ తల్లి కర్కశత్వం ప్రదర్శించింది

ఐదు రోజులుగా పసిబిడ్డకు అన్నం పెట్టకుండా కడుపు మాడ్చిన కన్నతల్లి

అమ్మ అన్నం పెట్టని అడిగిన కన్నా కూతురికి అన్నం బదులుగా పెద్ద అట్లకాడతో ఒళ్లంతా వాతలు పెట్టిన మాతృమూర్తి

ఆకలి గొన్న పసిబిడ్డ రైల్వే స్టేషన్ రోడ్డు పక్కన ఉన్న డస్ట్ బిన్లలో ఆహారం వెతుక్కుని తింటుండగా స్థానికుడు గమనించి 1098కి ఫిర్యాదు చేయడంతో ఈ దుర్భర ఘటన వెలుగుచూసింది

పోలీసులు, ఐసీడీఎస్‌ సిబ్బంది కథనం మేరకు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నివాసముంటున్న మాధవి భర్త నాలుగేళ్ల కిందట చనిపోయాడు

ఆమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది
శివపార్వతి అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటోంది

మాధవి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండగా, ఆమెకు శివపార్వతి సహకరిస్తోంది. ఆ బంధానికి బిడ్డ అడ్డుగా ఉందని భావించిన మాధవితో పాటు శివపార్వతి బాలికను చిత్రహింసలకు గురిచేస్తున్నారు

ఐదు రోజులుగా అన్నం పెట్టలేదు. ఆకలేస్తుందని అడిగితే అట్లకాడతో వాతలు పెట్టారు.

తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆ చిన్నారి చెత్త కుప్ప దగ్గర ఆహారం ఏరుకుంటుండగా చూసిన స్థానికుడొకరు.. శనివారం 1098కి ఫిర్యాదు చేశారు.
వెంటనే ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌

ప్రమీల, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్‌ ఆ పాప ఇంటికి వెళ్లారు.

వీరి రాకను చూసిన శివపార్వతి.. వారి పైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పింది. మాధవికి పెళ్లే కాలేదని,ఆమెకు కూతురు ఎక్కడిదని బుకాయించింది
తర్వాత వారిద్దరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడంతో దుస్తులు పెట్టే ర్యాక్‌లో పాపను దాచిపెట్టానని శివపార్వతి చెప్పింది
పోలీసులు వెళ్లి ఆ పాపను కాపాడి స్టేషన్‌కు తరలించారు. బాలిక శరీరంపై ఉన్న వాతలు, దెబ్బలు చూసిన పోలీసులు, ఐసీడీఎస్‌ సిబ్బంది విస్మయం చెందారు బాలికను నరసరావుపేటలోని శిశుగృహకు తరలించారు

Join WhatsApp

Join Now

Leave a Comment