ఏసీబీ వలలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్

ఏసీబీ వలలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్
 

ఏసీబీ వలలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్

🗓 జూన్ 25, కళ్యాణదుర్గం – M4News

కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి కలకలం రేపింది. స్థిరాస్తి వ్యాపారి వద్ద నుంచి రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

ఏసీబీ అధికారుల సమాచారం ప్రకారం, వ్యాపారి నాగేంద్ర నుంచి ముడుపులు తీసుకుంటుండగా తనిఖీ నిర్వహించి నారాయణస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కార్యాలయానికి తీసుకొచ్చి ఆధారాలు సేకరించారు.

గత సంవత్సరం డిసెంబర్ నుంచి సీనియర్ హోదాలో సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న నారాయణస్వామిపై పలు కాంట్రవర్సీలు ఇప్పటికే ఉన్నట్లు తెలుస్తోంది. కమిషన్ ప్రాతిపదికన అక్రమ లావాదేవీలు, ఫేవరుబుల్ రిజిస్ట్రేషన్లు వంటి ఆరోపణలు అతని మీద ఉన్నాయి.

ఇక జిల్లా రిజిస్టర్ ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న నారాయణస్వామి ఎట్టకేలకు ఏసీబీ చేతిలో చిక్కుకోవడం కలకలం రేపింది. అధికారులు మరింత విచారణ జరుపుతున్నారు.

అవినీతి నిరోధక సంస్థ పట్టు బిగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి చర్యల నుంచి మెరుగైన ప్రవర్తన కనబరచాలని ప్రజలు ఆశిస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment