హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి న్యాయం – బాసర ట్రిపుల్ ఐటీకీ సర్టిఫికెట్ల సత్వర పంపిణీ ఆదేశం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఫణి కుమార్
 

 

ఎమ్4 న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్, నిర్మల్, అక్టోబర్ 25

హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సామల ఫణి కుమార్‌కు ఎట్టకేలకు సర్టిఫికెట్లు అందించనున్నారు. ఫణి గత ఏడాదిన్నరుగా తన ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందటానికి ట్రిపుల్ ఐటీ బాసర అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే, తెలంగాణ హైకోర్టు సోమవారం నాటికి ఫణి కుమార్‌కు సర్టిఫికెట్లు అందించాలని, మంగళవారానికి సర్టిఫికెట్ల ఇస్తున్నట్లు కోర్టుకు తెలపాలని ట్రిపుల్ ఐటీ బాసర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రధాన అంశాలు:

  • ప్రభుత్వానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఆపడంతో విద్యార్థి సర్టిఫికెట్లు ఇవ్వడానికి అధికారుల నిరాకరణ.
  • వాదనను ఉచితంగా వాదించిన హైకోర్టు అడ్వకేట్ తక్కురి చందన.
  • విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందే హక్కు రక్షణ పొందిన హైకోర్టు తీర్పు.

ఫణి కుమార్ ఆవేదన: “ఏడాదిన్నరగా ఈ సర్టిఫికెట్లు పొందడానికి విశ్వవిద్యాలయం అధికారుల చుట్టూ తిరిగాను. కానీ ఎక్కడా స్పందన రాలేదు. నాకు న్యాయ సహాయం అందించిన తక్కురి చందన గారికి కృతజ్ఞతలు,” అని ఫణి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment