- ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి
- దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు
- 8 చోట్ల ఐకకాలంలో 55 బృందాలతో సోదాలు
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా వివిధ ప్రాంతాల్లో 8 చోట్ల 55 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాలు మరియు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ పత్రాల పరిశీలనలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నిర్మాత మరియు తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఆయన నివాసాలతో పాటు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ఏకకాలంలో 8 ప్రాంతాల్లో 55 బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లో కూడా ఐటీ అధికారులు పత్రాల పరిశీలన చేపట్టారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి పత్రాలు, ఆర్థిక లెక్కలు, బ్యాంక్ వివరాలు అనుమానాస్పదంగా ఉండటంతో ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం.
సినీ పరిశ్రమలో ప్రముఖంగా ఉన్న దిల్ రాజు వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో, ఐటీ శాఖ అధికారులు ఈ దాడులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.