అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలి
తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి. రాజేశ్వర్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
భైంసా : సెప్టెంబర్ 22
ప్రాథమిక పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతో ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను జారీ చేసింది, అని తపస్ నిర్మల్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి. రాజేశ్వర్ అన్నారు. 2015 నాటి కాలం చెల్లిన రేషనలైజేషన్ నిబంధనలను అమలు చేయాలని, 10 మంది విద్యార్థులకు ఒక టీచర్, 60 మందికి రెండు టీచర్లు అని నిర్ణయించడం పాఠశాలల బలోపేతానికి మార్గం కాదని అన్నారు.
రాజేశ్వర్ అభిప్రాయం ప్రకారం, ఈ ఉత్తర్వులు బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేసే కుట్రగా భావించవలసి వస్తోంది. ప్రాథమిక పాఠశాలల సంఖ్యతో సంబంధం లేకుండా 50 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 3 ఉపాధ్యాయులను, 50 నుండి 100 విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 5 ఉపాధ్యాయులను కేటాయించడమే సరైన మార్గమని సూచించారు. ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడిని మంజూరు చేయాలని, ఈ విధమైన ఉత్తర్వులు సరైనది కాదని తేల్చిచెప్పారు.