Nandyal/Banaganapalle (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. పశ్చిమ నేపాల్‌లోని బజాంగ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
పశ్చిమ నేపాల్‌లోని బజాంగ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం ప్రకారం ఉదయం 4:40 గంటలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
గత వారం కూడా లుంబినీ ప్రావిన్స్‌లోని రుకుమ్ ఈస్ట్ జిల్లాలో 5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, ఈ రెండు సంఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.












