మందమర్రి: జ్వరంతో ఇంటర్ విద్యార్థిని మృతి
మందమర్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వెంకటాపూర్ కు చెందిన చిట్టవేణ అశ్విత (17) అనే విద్యార్థిని మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. దసరా సెలవులకు అమ్మమ్మ ఊరైన బెల్లంపల్లి మండలం లోని ఆకెనపల్లికి వెళ్ళిన ఆమె, అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.