బెల్లంపల్లి:
బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో రైల్వే విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీ సమయంలో, రైల్వేస్టేషన్ ఆవరణలో పలు విభాగాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. బుకింగ్ కార్యాలయంలో టిక్కెట్ల క్రయ విక్రయాలపై సిబ్బందిని ప్రశ్నించారు. ముఖ్యంగా, తాత్కాల్ టిక్కెట్ల రిజర్వేషన్ అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చిన అంశాలను విచారించి, వాస్తవాలను నిర్ధారించుకున్నట్లు సమాచారం.