వరద కాల్వలో లారీ బోల్తా.
-డ్రైవరుకు గాయాలు.
మనోరంజని ప్రతినిధి
సారంగాపూర్ : ఫిబ్రవరి 20
నిర్మల్ జిల్లా – సారంగాపూర్:మండలంలోని రాణాపూర్ గ్రామ సమీపంలోని ప్రాణిత చేవెళ్ల స్వర్ణ వరద కాల్వ లో లారీ అదుపు తప్పి బోల్తా పడి డ్రైవర్ కు గాయాలు అయినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఏపీ 05/టిడి 1023 నెంబర్ గల లారీ సిమెంట్ బస్తాల లోడ్ తో గురువారం
అదిలాబాద్ నుండి నిర్మల్ వైపు వస్తుండగా డ్రైవర్ ఇప్తికర్ నిర్లక్ష్యంగా నడపడంవల్ల రానాపూర్ సమీపంలో గల ప్రాణహిత చేవెళ్ల స్వర్ణ వరద కాల్వలో బోల్తా పడిందని ఎస్సై తెలిపారు ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు