తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ – అతి భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ – అతి భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు
  1. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.
  2. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు.
  3. హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.
  4. సూర్యాపేట, మహబూబాబాద్, నెక్కొండలో అధిక వర్షపాతం నమోదు.
  5. విద్యాసంస్థలకు సెలవు, ప్రభుత్వం అప్రమత్తం.

తెలంగాణలో వాయుగుండం ప్రభావంతో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

రంగారెడ్డి జిల్లా: సెప్టెంబర్ 01

తెలంగాణ రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో, ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

హైదారాబాద్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు, ప్రభుత్వ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో అత్యధికంగా 29 సెంచీమీటర్ల వర్షపాతం నమోదవగా, మధిరలో 20 సెంటీమీటర్లు, మహబూబాబాద్‌లో 16.9 సెంటీమీటర్లు, నెక్కొండలో 25.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.

తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ – అతి భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణ జిల్లాల‌కు జారీ అయిన అలర్ట్స్:

  • రెడ్ అలర్ట్: అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట్, గద్వాల్ జిల్లాలు. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు.
  • ఆరెంజ్ అలర్ట్: కొమురం భీమ్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
  • ఎల్లో అలర్ట్: రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాలు. ఇక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచనలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో రాత్రి నుండి మోస్తరు నుండి భారీ వర్షం నమోదవుతోంది, తద్వారా పరిస్థితి మరింత చేదోడుగా మారనుందని భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment