- జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి చెందాడు.
- మెట్ పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు ఓంకార్ సుబ్బరాజు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
- స్థానిక హోండా షోరూం వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
- మెట్ పల్లి ఎస్సై చిరంజీవి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జగిత్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. మెట్ పల్లి శివారులో ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు ఓంకార్ సుబ్బరాజు మృతి చెందారు. తెల్లవారుజామున టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మెట్ పల్లి ఎస్సై చిరంజీవి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జగిత్యాల జిల్లాలో పండగ పూట విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెట్ పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు ఓంకార్ సుబ్బరాజు గురువారం తెల్లవారుజామున మెట్ పల్లి లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న TS16 UC9963 నంబర్ గల ఆర్టీసీ బస్సు మెట్ పల్లి శివారులోని హోండా షోరూం వద్ద ఓంకార్ సుబ్బరాజును ఢీకొట్టింది, ఈ సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ దుర్ఘటనను తెలుసుకున్న మెట్ పల్లి ఎస్సై చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని హోంగార్డు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో హోంగార్డు కుటుంబంలో విషాదం నెలకొంది.