బంగాళాఖాతంపై ఉపరితల చక్రవాక ఆవర్తనం… తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

బంగాళాఖాతంపై ఉపరితల చక్రవాక ఆవర్తనం... తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

బంగాళాఖాతంపై ఉపరితల చక్రవాక ఆవర్తనం… తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

బంగాళాఖాతంపై ఏర్పడ్డ ఉపరితల చక్రవాక ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉపరితల చక్రవాక ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.

రేపు, ఎల్లుండి ( సెప్టెంబర్ 21, 22 ) పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించిన వాతావరణ శాఖ.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.*

సినోప్టిక్ ఫీచర్స్ :

ఉత్తర దక్షిణ ద్రోణి ఈశాన్య ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాక ఆవర్తనం నుండి మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ విదర్భ వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది వాతావరణ శాఖ.

శనివారం ( సెప్టెంబర్ 21 ) ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం నుండి మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్రతీరం, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక ల మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి. మీ ఎత్తులో ఉన్నట్లు తెలిపింది. గత మూడు రోజులుగా మరాత్వాడ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాక ఆవర్తనం ఈరోజు బలహీనపడినట్లు తెలిపింది వాతావరణ శాఖ.

ఇవాళ, రేపు వాతావరణం ఎలా ఉంటుందంటే:

ఆదివారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సోమవారం ( సెప్టెంబర్ 22 ) ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది

Join WhatsApp

Join Now

Leave a Comment