మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం (NEHS) మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ అందించనున్నారు. దీంతో పాటు, అవుట్ పేషెంట్ (OP) సేవలు, ల్యాబ్ పరీక్షలపై 50% రాయితీ లభించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం (NEHS) మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ ఉచితంగా అందించనున్నారు. అలాగే, అవుట్ పేషెంట్ (OP) సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకంలో భాగంగా OP, ల్యాబ్ పరీక్షలపై 50% రాయితీ కల్పించనున్నారు.
ప్రస్తుతం ఈ స్కీమ్ కింద ఉద్యోగి తన బేసిక్ పేలో 1.5% చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా అందజేస్తుంది. ఈ కొత్త పథకం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.












