ఖానాపూర్, జూలై 21
ఖానాూర్ట్టణోసరక్షఆసత్రిఆధ్వర్యోగళవారఉచితెగావై్యశిబిరజరిగిి.డాక్టర్బి.కృష్ణనేతృత్వో205ిరోగకవై్యరీక్షచేసిఉచితగాిణీచేశార.్రజకనాణ్యైనవై్యసేవఅిచడేక్ష్యనినిర్వాహకతెిార.
ఖానాపూర్ పట్టణంలోని సురక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు డాక్టర్ బి. కృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 205 మంది రోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి రజిత–రాజేందర్, ఉప సర్పంచ్ మట్ట రాంబాబు, ఆసుపత్రి వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.












