Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అబ్దుల్ జవాద్ నులిపురుగుల నివారణ అందరి బాధ్యత అని తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చించోలి బి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు ఆయన మాత్రలు పంపిణీ చేశారు.
నులిపురుగుల నివారణ సమాజంలో ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉంటుందని సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అబ్దుల్ జవాద్ అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చించోలి బి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు.
నులిపురుగుల కారణంగా పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని, బుద్ధి మాంద్యం వస్తుందని, రక్తహీనత ఏర్పడుతుందని ఆయన చెప్పారు. వీటి నివారణ కోసం ప్రతి విద్యార్థి ఏడాదికి రెండుసార్లు నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవాలని సూచించారు. నులిపురుగుల నివారణ విషయం లో సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
కాగా, తమ పిహెచ్సీ పరిధిలో 94,16 మందికి ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమోహన్ గౌడ్, ఉషారాణి, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, ఆరోగ్య కార్యకర్తలు నుస్రత్, రాజేందర్, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సంగీత, సిబ్బంది ప్రణయసుధ, షగుఫుత, ఆమీనా తదితరులు పాల్గొన్నారు.












