బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
సోనాల మండలంలోని కోట గ్రామంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల విద్యార్థులకు సోమవారం నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఆరోగ్య పర్యవేక్షకుడు ఉత్తమ్, గ్రామ సర్పంచ్ పూజ సంగ్రామ్ ఆధ్వర్యంలో గుడాల అనీష్ చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో వాతావరణ మార్పులు, నీటి కలుషితంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం పరిశుభ్రమైన నీటిని వినియోగించడంతో పాటు పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు మరియు గ్రామ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి విజయ్, ఆరోగ్య సహాయకుడు లింగారెడ్డి, సహాయక నర్సు జమున, ఆశా కార్యకర్త బాలబాయి, ప్రధానోపాధ్యాయులు శంకర్, పరశురాం, బాలాజీ, పవన్ తదితరులు పాల్గొన్నారు.