భైంసా, జూలై 01
జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భైంసా పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. అబ్దుల్లాపూర్ గ్రామంలో సేవలందిస్తున్న వైద్యులు అమ్ముల సాగర్ను వికాస్ హై స్కూల్ ఆధ్వర్యంలో సన్మానించారు. వైద్యుల సేవలను పలువురు కొనియాడారు.
జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినోత్సవంగా గుర్తించి భైంసా పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా పట్టణంలోని జయశంకర్ కాలనీతో పాటు అబ్దుల్లాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న అమ్ముల సాగర్ను వికాస్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాలతో సత్కరించి, స్వీట్లు అందజేశారు. వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వికాస్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రాజన్న, ఉపాధ్యాయుడు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.












