మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
వేదం పాఠశాలలో జాతీయ వైద్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల విద్యార్థులు వైద్యుల వేషధారణలో వైద్యం అందించే విధానాలను ప్రదర్శించారు.
స్తానిక వేదం పాఠశాలలో జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ వైద్యులు చేసే సేవల గురించి వివరించారు. పిల్లలు వైద్యుల వేషధారణ ధరించి వైద్యం అందించే విధానాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు డాక్టర్స్ సేవల గురించి ఉపన్యాసాలు ఇచ్చి, 24 గంటలు వారు సేవలో నిమగ్నం అవుతారని కొనియాడారు. తరువాత విద్యార్థులు బోథ్ లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు దవాఖానలకు వెళ్ళి వైద్యులకు పుష్పాలు అందించి జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











