Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
ధన్వంతరి ఎక్సలెన్స్-2026 అవార్డు అందుకున్న ముథోల్ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. అనిల్ కుమార్కు మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ ఘనంగా సన్మానించారు. డా. అనిల్ కుమార్ వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తున్నారని దేవోజీ భూమేష్ కొనియాడారు.
ఇటీవల ధన్వంతరి ఎక్సలెన్స్-2026 అవార్డు అందుకున్న ముథోల్ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. అనిల్ కుమార్ను మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దేవోజీ భూమేష్ మాట్లాడుతూ డా. అనిల్ కుమార్ వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ ముథోల్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తున్నారని కొనియాడారు.
భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించి ఇలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు, సత్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు దేవోజీ మారుతి, సురేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.











