గుంటూరు, 2026-06-05
8 నుంచి 15 ఏళ్ల వయస్సు గల పిల్లలు తరచూ తలనొప్పితో బాధపడుతుంటే తల్లిదండ్రులు అశ్రద్ధ చేయరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ తలనొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు.

మైగ్రేన్ సూచనలు
తరచూ వచ్చే లేదా తీవ్రంగా ఉండే తలనొప్పి మైగ్రేన్‌కు సంబంధించిన లక్షణం కావచ్చు. అరుదైన సందర్భాల్లో ఇతర నాడీ సంబంధిత సమస్యలకు కూడా సంకేతంగా ఉండే అవకాశం ఉన్నందున, తలనొప్పి పదేపదే వస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు తెలిపారు.
ప్రమాద సంకేతాలు
ముఖ్యంగా తలనొప్పితో పాటు వాంతులు, చూపు మందగించడం, తల తిరగడం, మూర్ఛ, ప్రవర్తనలో మార్పులు లేదా రాత్రివేళ తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే సంబంధిత న్యూరో ఫిజీషియన్‌ను కలిసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి
పిల్లలు తరచూ తలనొప్పితో బాధపడితే స్వయంగా మందులు ఇవ్వకుండా వైద్యుల సలహా తీసుకోవాలని మనోరంజని తెలుగు టైమ్స్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తోంది. వ్యాధి ముదరకముందే తగిన వైద్య సహాయం అందించాలి. తలనొప్పిని అశ్రద్ధ చేయరాదు.. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టరాదు.