బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
నవజాత శిశువులకు ఆరోగ్యశ్రీ పథకం ఒక వరమని, సంజీవనిగా పనిచేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముధోల్ నియోజకవర్గ ప్రజలకు బైంసా పట్టణంలోని జి.డి.ఆర్. కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నవజాత శిశువులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.

పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ పర్యవేక్షణలో శిశువులకు ఆరోగ్యశ్రీ పథకం అమలవుతోంది. ప్రతిరోజూ ఎందరో నవజాత శిశువులకు మెరుగైన చికిత్స అందడంతో వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో భైంసాలో ఈ సేవలు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు నవజాత శిశువులను మహారాష్ట్రలోని నాందేడ్, నిర్మల్, నిజాంబాద్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల అనేక వ్యయప్రయాసాలకు లోనయ్యేవారు. ప్రస్తుతము బైంసాలోనే అందుబాటులోకి రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన సేవలు అందిస్తున్న డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, కాంపౌండర్లు, సిస్టర్లకు నవజాత శిశువుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.