ముస్తాక్ అహ్మద్ ఖాన్‌కు ఘన సన్మానం
ఇంజినీరింగ్, మోటార్ లైన్ సిబ్బంది ఆధ్వర్యంలో పదవి విరమణ శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 1 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
నిజామాబాద్ నగరపాలక సంస్థలో 29 సంవత్సరాలుగా అంకితభావంతో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారి శ్రీ ముస్తాక్ అహ్మద్ ఖాన్ పదవి విరమణ సందర్భంగా, ఇంజనీరింగ్ విభాగం మరియు మోటార్ లైన్ సాజిద్ బృందం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.వృత్తినే దైవంగా భావించి, ప్రజాప్రయోజనాలకు తగిన విధంగా శ్రద్ధగా పనిచేసిన ఆయనకు సహోద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోటార్ లైన్ సాజిద్ మాట్లాడుతూ,“పదవి విరమణ చేసినా మీ అనుభవం నగరపాలక సిబ్బందికి మార్గదర్శకం. మీ ఆత్మీయత ఎల్లప్పుడూ కొనసాగాలి” అని కోరారు. అవకాశం ఇచ్చిన సహోద్యోగులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్తాక్ అహ్మద్ ఖాన్ అన్నారు—
“పదవి విరమణ వృత్తికే, వ్యక్తికి కాదు. నేను జీవించేంతకాలం నగరపాలక సిబ్బందికి, మోటార్ లైన్ సహోదరులకు అందుబాటులో ఉంటాను. పనికంటే ముఖ్యమైనది టైం పంక్చువాలిటీ—దాన్ని ప్రతి ఉద్యోగి పాటించాలి” అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇంజనీర్స్ విభాగం మరియు మోటార్ లైన్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు