- మసల్గా తాండా యాడి జగదాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జయప్రదంగా కొనసాగుతున్నాయి.
- కాశీ మహరాజ్ ఆధ్వర్యంలో యజ్ఞం, పూజ కార్యక్రమాలు.
- రాత్రివేళ భజన కార్యక్రమం నిర్వహణ.
తానూర్ మండలంలోని మసల్గా తాండా యాడి జగదాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కాశీ మహరాజ్ ఆధ్వర్యంలో యజ్ఞం, పూజలు నిర్వహించగా రాత్రివేళ భజన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
తానూర్ మండలంలోని మసల్గా తాండా యాడి జగదాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కాశీ మహరాజ్ పూజా కార్యక్రమంలో పాల్గొని యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆదివారం నాటికి నాలుగవ రోజు కూడా యజ్ఞం, పూజలు ఘనంగా నిర్వహించారు.
నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రతి రాత్రి భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో స్థానిక నాయకులు, జాదవ్ శ్యాం రావు నాయక్, మాజి ఎంపిటిసి జాదవ్ బాబురావు, మాజి సర్పంచ్ పుండలిక్, జాదవ్ దీనేష్, రాజు, నితిన్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు వీరభద్రుడి ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.